BREAKING
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం …పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీలు. కార్మిక బోర్డు లో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టాలి అసలు ఎవరు ఈ గరివిడి లక్ష్మి.. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా విశేషాలు

చేతుల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం - డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌

Select Suryaa Now
చేతుల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం - డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌
సూర్య నస్పూర్: ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్ రాథోడ్‌ తెలిపారు. గురువారం నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌. వెంకటేష్‌తో కలిసి చేతుల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. చేతుల పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అతిసారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీలో వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్‌ తదితర అసంక్రమిత వ్యాధుల పరీక్షలు నిర్వహించి, వ్యాధులను ముందుగా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. రోగులకు క్రమం తప్పకుండా మందులు అందించాలని, కార్పొరేటర్ల సహకారంతో ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.గర్భిణుల నమోదు, టీకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై దృష్టి సారించాలని, 108, అమ్మ ఒడి అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటిస్తూ, స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా గదులను శుభ్రం చేసి ఫొటోలను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్‌, నర్సింగ్‌ అధికారి కవిత, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.