చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి.
దుమ్ముగూడెం, సూర్య ప్రతినిధి,(కల్లూరి సుమన్)::
చర్ల కాంగ్రెస్ పార్టీ మండల వ్యవహారాల ఇన్చార్జిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుమ్ముగూడెం వాసి వాసి పిలక వెంకట రమణారెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఏన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్ పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి నీ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ తోట దేవి ప్రసన్న నియమించారు. ఈ సందర్భంగా వెంకటరమరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చర్ల వ్యవహారాల ఇన్చార్జిగా నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన డిసిసి ప్రెసిడెంట్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చర్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.