BREAKING
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!

అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Select Suryaa Now
అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

• అనధికార నిర్మాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి

• జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార నిర్మాణాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని 17, 18 వార్డులను ఆకస్మికంగా సందర్శించి, ఆయా వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డులో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో సి.సి. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, నిర్మాణంలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. 17వ వార్డులో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాన్ని పరిశీలించి, మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టడం విరుద్ధమని, సదరు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించి అనధికార నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికార నిర్మాణానికి ఇంటి నంబరు కేటాయించి, సంబంధిత వివరాలను ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయడంలో సంబంధిత దరఖాస్తులు, అనుమతులు, ఇతర మున్సిపల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ అయితే అట్టి ఇంటి నంబరు వివరాలను నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ వ్యవస్థ నుంచి తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో అనధికార నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయించడం, వాటికి సంబంధించిన వివరాలను మున్సిపల్ రికార్డులలో నమోదు చేయడం వంటి అంశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రణాళిక అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

అనంతరం మండల కేంద్రంలోని 86, 87, 88, 89 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ప్రత్యేక శిబిరాలను సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా దావా, అభ్యంతరాల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. బెల్లంపల్లి ఈఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఓటరు జాబితా సమగ్ర సవరణలో అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని, అనర్హుల వివరాలు ఉండకూడదని, ఆ దిశగా స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.