BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

ఆర్టీఐ అమలులో జిల్లాకు అరుదైన గౌరవం రాష్ట్రంలోనే 'ఉత్తమ జిల్లా'గా ఎంపిక

Select Suryaa Now
ఆర్టీఐ అమలులో జిల్లాకు అరుదైన గౌరవం  రాష్ట్రంలోనే 'ఉత్తమ జిల్లా'గా ఎంపిక

 


*గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందజేత

సూర్యాపేట

సమాచార హక్కు చట్టం  అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. పారదర్శకమైన పాలన, వేగవంతమైన సమాచార వేదికగా నిలవడంతో సూర్యాపేటను “ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్, శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల వారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు .
*పారదర్శక పాలనకు దక్కిన గుర్తింపు*
ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచార హక్కు చట్టం ద్వారా వేగవంతమైన, ఖచ్చితమైన సేవలు అందిస్తూ, వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపింది. జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్టీఐ దరఖాస్తులను సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని అధికారులు తెలిపారు.
*అభినందనల వెల్లువ*
రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా ఎంపికై అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపినారు.
అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, సిపిఓ కిషన్, సిఎఫ్ఓ దామోదర్ రెడ్డి,  ఆర్టీవో పురుషోత్తమ రెడ్డి, డిపిఆర్ఓ వల్లోజి శ్రీనివాసరావు డిడి అడల్ట్ ఎడ్యుకేషన్ సిహెచ్.అనిల్ కుమార్, ఇడి ఎస్ సి కార్పొరేషన్ ఉపేందర్, డిఎస్ డిఓ వెంకట్ రెడ్డి, డిఐఇఓ సులోచన రాణీ, జిఎమ్ ఇండస్ట్రీస్ భారతి, అధికారులు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.