BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

47 మందికి రూ.21.09 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

Select Suryaa Now
47 మందికి రూ.21.09 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
 
 సూర్య గన్నేరువరం ;గన్నేరువరం మండలంలో 47 మంది లబ్ధిదారులకు రూ.21.09 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఖాసీంపేట రైతువేదికలో పంపిణీ చేశారు. అనంతరం ఖాసీంపేటలో ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన అపూర్వ మహిళా సమాఖ్య వీవో భవనాన్ని ప్రారంభించారు. నర్సింగపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి సముద్రాల రామానుజాచార్యులు, ఇన్‌చార్జి ఎంపీడీవో వేమల సురేందర్, తహసీల్దార్ ఇప్ప నరేందర్‌చారి, వ్యవసాయ అధికారి కిరణ్మయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, ముసుకు ఉపేందర్‌రెడ్డి, పులి కృష్ణ, కర్నే చంద్రయ్య, ఐలయ్య, కరుణాకర్‌రెడ్డి, కొమ్మెర రవీందర్‌రెడ్డి, జువ్వాడి మన్మోహన్‌రావు, అలవాల కోటి, మాతంగి అనిల్, అంతగిరి వినయ్‌కుమార్, పరిపూర్ణచారి, సంపత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.