BREAKING
మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు ‘యే ప్రేమ్ మోల్ లియా’ మూవీ రివ్యూ: ఆయుష్మాన్ ఖురానా, శర్వరీల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే? చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం నిరుద్యోగులపై బీఆర్ఎస్‌కు మొసలి కన్నీరుః టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఎలిజబెత్ హోమ్స్ నిజస్వరూపంపై ‘యు క్యాన్ సీ ఎవ్రీథింగ్’ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే? క్యూబెక్ మత చిహ్నాల నిషేధ చట్టంపై కెనడా సుప్రీంకోర్టు తీర్పు ముంబై, పుణెలో సంగీత, ఆహార వేడుకల సందడి.. దిల్‌జిత్ దొసాంఝ్, రోలింగ్ లౌడ్ కచేరీలు అమెరికా వైమానిక దళ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాకర్ల దాడి: కీలక డేటాకు ముప్పు! తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాంః మంత్రి పొన్నం నా సినిమాల్లో షాక్ వ్యాల్యూ ఉండాల్సిందే.. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనేదే నా లక్ష్యం: సందీప్ రెడ్డి వంగా వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్ వారణాసిలో నవంబర్ 28న కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ 'హిట్‌మ్యాన్' ?.. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన

Select Suryaa Now
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ 'హిట్‌మ్యాన్' ?.. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన
ముంబై కెప్టెన్ రేసులో రోహిత్
ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు అధికారిక ప్రకటన
పంజాబ్‌కు హార్దిక్
ట్రేడ్ డీల్‌లో భాగంగా ముంబైకి అర్ష్‌దీప్ సింగ్
5 ఐపీఎల్ టైటిళ్లు
రోహిత్ సారథ్యంలో ముంబై సాధించిన ట్రోఫీలు
తిలక్ వర్మ
వైస్ కెప్టెన్ రేసులో ముందంజ
ముంబై: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ ద్వారా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లడంతో, ముంబై పగ్గాలు మళ్లీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 5:45 గంటలకు కొత్త కెప్టెన్ పేరును ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనుంది.

ఇటీవల ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో జట్టు క్యాప్ పట్టుకున్న చేయితో కూడిన ఒక ఆసక్తికర టీజర్‌ను పోస్ట్ చేసింది. అది అచ్చం రోహిత్ శర్మ శైలిని పోలి ఉండటంతో 'హిట్‌మ్యాన్' మళ్లీ కెప్టెన్‌గా రావడం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. మూడు సీజన్ల పాటు ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు మారగా, ఆ జట్టు నుంచి స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. గత సీజన్‌లో ముంబై జట్టు కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమై తీవ్ర నిరాశపరిచింది.

ఈ నేపథ్యంలో 2013 నుంచి 2020 మధ్య ముంబై ఇండియన్స్‌కు రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ అనుభవం జట్టుకు అత్యవసరమని కొత్త హెడ్ కోచ్ కీరన్ పొలార్డ్, మేనేజ్‌మెంట్ భావిస్తున్నాయి. కెప్టెన్ రేసులో రోహిత్ శర్మ ప్రధాన పోటీదారుగా ఉండగా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని క్రీడా వర్గాల సమాచారం. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి ముందు ముంబై మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.