కామన్వెల్త్ దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు
సూర్య జాతీయ డెస్క్ (న్యూఢిల్లీ): వివిధ దేశాల మధ్య వాణిజ్య మార్గాలు అంతస్థులవడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ, ఏ ఒక్క దేశంపై లేదా మార్గంపై పూర్తిగా ఆధారపడే ధోరణికి స్వస్తి పలకాలని జైశంకర్ సూచించారు. సరఫరా గొలుసులలో (Supply Chains) అంతరాలను పూడ్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, హరిత శక్తి మరియు ఆర్థిక భాగస్వామ్యాలను విస్తరించడం ద్వారా కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక రక్షణ కల్పించడంతో పాటు చిన్న ద్వీప దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మరియు ఆర్థిక సంక్షోభాలను అధిగమించేందుకు ఉమ్మడి వ్యూహాలు అవసరమని జైశంకర్ అభిప్రాయపడ్డారు. పరస్పర విశ్వాసం, పారదర్శకత ఆధారంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రతి దేశానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధి సాధన దిశగా సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
భారత్ తన వంతుగా అన్ని మిత్ర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, సరఫరా గొలుసుల స్థిరత్వానికి కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. ఈ సదస్సులో వ్యక్తయిన అభిప్రాయాలు భవిష్యత్తులో కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తాయని, పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.