BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

భారత్ పర్యావరణ స్పూర్తి ప్రపంచానికి ఆదర్శం

Select Suryaa Now
భారత్ పర్యావరణ స్పూర్తి ప్రపంచానికి ఆదర్శం

సూర్య జాతీయ డెస్క్: పర్యావరణ పరిరక్షణ మరియు హరిత ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేయడంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహం ప్రపంచ దేశాలన్నింటికీ గొప్ప స్ఫూర్తినిస్తోందని బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ విలియం ప్రశంసించారు. ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక వృద్ధి లేదా పర్యావరణ పరిరక్షణ అనే తప్పుడు ఎంపికల మధ్య నలగకుండా, అభివృద్ధిని సాధిస్తూనే ప్రకృతిని కాపాడుకోవడంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్త్‌షాట్ ప్రైజ్ విజయతులు మరియు ఫైనలిస్టులను అందించిన దేశంగా భారత్ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు.

భారతదేశం తన ఇంధన అవసరాల కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించడం అభినందనీయమని ప్రిన్స్ విలియం పేర్కొన్నారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 50 శాతం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని భారత్ ఐదు సంవత్సరాల ముందే చేరుకుందని, అలాగే గత దశాబ్ద కాలంలో దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం యాభై రెట్లకు పైగా పెరిగిందని గుర్తుచేశారు. కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా భారత్ చేపడుతున్న వినూత్న చర్యలు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ వేదికపై భారతీయ సంస్థలు సాధించిన విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మలచడంలో టకాచార్ సంస్థ చేసిన కృషిని, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ రిక్షాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. హిందీలోని 'రంగ్ బిరంగీ దునియా' (రంగుల ప్రపంచం) అనే పదాన్ని ఉదాహరణగా చూపుతూ, భవిష్యత్తును కేవలం నలుపులు-తెలుపులుగా కాకుండా అనేకానేక రంగుల కలయికగా చూడాలని, వివిధ రంగాల నుంచి వచ్చే వినూత్న ఆలోచనలతోనే పర్యావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని పిలుపునిచ్చారు.

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు మరియు ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాలు మనల్ని కేవలం ఇచ్చిన హామీల ఆధారంగా కాకుండా, భూమిని కాపాడుకునేందుకు మనం తీసుకున్న చర్యల ఆధారంగానే బేరీజు వేస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి విభేదాలకు తావులేకుండా సమిష్టిగా పనిచేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, మార్పును కోరుకునే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.