వాషింగ్టన్ డీసీలో ఘనంగా కేఏ పాల్ జన్మదిన వేడుకలు.. ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రముఖులు
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రజాశాంతి పార్టీ అధినేత, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి సదస్సు (గ్లోబల్ పీస్ సమ్మిట్) వేదికగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అంతర్జాతీయ రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సదస్సులో ప్రపంచ శాంతి స్థాపన, దేశాల మధ్య సత్సంబంధాలు మరియు అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా సేవలందిస్తున్న కేఏ పాల్ జన్మదిన వేడుకలు వాషింగ్టన్ డీసీలో జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది