BREAKING
చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు! ఉప్పాడ దేశంలో సంఘ్ పరివార్‌–గాంధీ పరివార్‌ మధ్య పోరాటం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పాప్ లియో 14 తీవ్ర హెచ్చరికలు

Select Suryaa Now
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పాప్ లియో 14 తీవ్ర హెచ్చరికలు

సూర్య అంతర్జాతీయ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ సమాజం సాంకేతిక పరిజ్ఞానం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేథలిక్ ధార్మిక గురువు పాప్ లియో 14 తీవ్ర విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల ప్రాన్స్ పర్యటనను శుక్రవారం ప్రారంభించిన ఆయన, ఏఐ సాంకేతికత భవిష్యత్తులో భూమిని నియంత్రించే 'యంత్రాల స్వర్గధామం'గా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, నిత్య జీవితంలో విస్తరిస్తున్న ఈ డిజిటల్ విప్లవం మధ్య మానవత్వాన్ని కాపాడుకోవడానికి నైతిక విచక్షణతో కూడిన విద్య అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఒక పాప్ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ సందర్భంగా పాప్ లియో క్రైస్తవ మత ప్రాథమిక సిద్ధాంతాలను పునరుద్ఘాటిస్తూ, వైద్య రంగాన్ని లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చడాన్ని తప్పుబట్టారు. స్వచ్ఛంద మరణాలు, జన్యుపరమైన మార్పులు, అద్దె గర్భాలు మరియు మానవ అవయవాల వ్యాపారాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ముఖ్యంగా నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న వారికి సహాయక మరణాన్ని అనుమతిస్తూ ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆయన పునరుద్ధరించబడిన చారిత్రాత్మక నోట్రే డామ్ కేథడ్రల్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం లూర్దేస్ మరియు మెట్జ్ ప్రాంతాలలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రసంగించడంతో పాటు చర్చిలలో చోటుచేసుకున్న పాత లైంగిక వేధింపుల ఘటనల బాధితులను కూడా పాప్ కలవనున్నారు. చర్చి ప్రతిష్టను పునరుద్ధరించడానికి, శాంతి సందేశాన్ని అందించడానికి ఈ పర్యటన ఎంతో కీలకమైనదని భావిస్తున్నారు. పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ దంపతులు పాప్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, సాంకేతిక సవాళ్లు పెరుగుతున్న వేళ పాప్ లియో ఫ్రాన్స్ పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.