BREAKING
ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా! నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం అదృశ్యమైన వివాహిత మహిళ హత్య జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నువ్వే నువ్వే సినిమాలో పాట పాడటానికి అసలు కారణం అదే: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్ *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -* అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు: రాబోయే ఎన్నికల్లో పోటీపై సందేహం!

రణబాలి డాక్యుమెంటరీ థర్డ్ ఎపిసోడ్ విడుదల.. రాయలసీమ వీరుల స్ఫూర్తితో హీరో పాత్ర

Select Suryaa Now
రణబాలి డాక్యుమెంటరీ థర్డ్ ఎపిసోడ్ విడుదల.. రాయలసీమ వీరుల స్ఫూర్తితో హీరో పాత్ర

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 16న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, రణబాలి నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా తాజాగా మూడో ఎపిసోడ్ ది మెన్ వి ఫర్ గాట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తమ మాతృభూమి కోసం ప్రాణాలర్పించి పోరాడిన కొందరు రాయలసీమ చారిత్రక వీరుల స్ఫూర్తితోనే రణబాలి పాత్రను సృష్టించినట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ ఎపిసోడ్‌లో వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీ సినిమా నేపథ్యంపై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ, రాయలసీమ గడ్డ ఎందరో వీరులను కన్నదని తెలిపారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి వంటి సీమ పాలెగాళ్ల వీరగాథలను గుర్తుచేశారు. గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి చరిత్ర విన్నప్పుడే తనకు ఈ కథా ఆలోచన వచ్చిందని, కరువు కాలంలో ఆస్తులమ్మి వేలాది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిల స్ఫూర్తితో రణబాలి పాత్రను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ వీరుల ధైర్యసాహసాలను తెరపై ఆవిష్కరిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.