నవదీప్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ టీజర్ ఆవిష్కరణ.. రాయలసీమ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు ఆదరణ లభిస్తున్న తరుణంలో సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మొహబ్బత్. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరగగా, ఈ వేడుకకు ప్రముఖ నటుడు నవదీప్ మరియు దర్శకుడు కరుణకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ షేక్, సినిమాటోగ్రఫర్ వైఎస్ కృష్ణ, రచయిత కలాంతో పాటు నటులు అజయ్ ఘోష్, ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, సంతోషి, దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఈ వేడుకలో హీరో నవదీప్ చేతుల మీదుగా సినిమా టీజర్ లాంఛ్ చేయగా, విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ సొంత ఊరిలో స్కూల్ కట్టించడమే కాకుండా, సినిమాపై ఉన్న మక్కువతో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఎంతో అంకితభావంతో నిర్మిస్తున్న నిర్మాత అఫ్రోజ్ షేక్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ చిత్రం ద్వారా దర్శకుడు పలువురు కొత్త టాలెంటెడ్ నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అభినందనీయమని, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్ర విశేషాల గురించి నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ, ఇది గతంలో వచ్చిన క్లాసిక్ హిట్ ప్రేమిస్తే సినిమాను తలపించేలా సాగే ఓ డిఫరెంట్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ అని తెలిపారు. రాయలసీమ నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను అత్యంత సహజంగా తెరకెక్కించారని, సునీల్ కశ్యప్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో చెబుతూ, ఇన్నేళ్ల ప్రవాస జీవితం తర్వాత చిత్రనిర్మాత చేపట్టిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాము
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీని అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు వెల్లడించారు. కడప ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా మ్యూజికల్ హంగులతో ఈ చిత్రం సాగుతుందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.