BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

త్వరలోనే పట్టాలెక్కనున్న ‘భారతీయుడు 3’ షూటింగ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్ విడుదల

Select Suryaa Now
త్వరలోనే పట్టాలెక్కనున్న ‘భారతీయుడు 3’ షూటింగ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్ విడుదల

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు 3 షూటింగ్ త్వరలోనే మళ్లీ ప్రారంభం కానుంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా, ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని కొనసాగింపుగా రాబోతున్న భారతీయుడు 3 చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మరో పది రోజుల్లోనే భారతీయుడు 3 చిత్రానికి సంబంధించిన మిగిలిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దారిలో దుమ్ము, దూళి రేగుతున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. భారతీయుడు 2 చిత్ర క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి సంబంధించిన లీడ్ ఇవ్వడంతో, ఈ సినిమాలో సేనాపతి అవినీతిపై చేసే పోరాటం ఏ స్థాయిలో ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. షూటింగ్ పూర్తి కాగానే త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో పాటు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆయన, సినిమా రంగంలోనూ నూతన సాంకేతిక ప్రమాణాలు, అత్యున్నత నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో 2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి విజువల్ వండర్స్‌తో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఆయన, ఇప్పుడు భారతీయుడు 3 తో మరోసరి సరికొత్త రికార్డులు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.