BREAKING
ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు నిరాధారం పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్ నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు భోగాపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కదిలిన రైతాంగం జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం ఏపీలో 'తల్లికి వందనం

చంద్రయాన్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్.. రాకెట్ తయారు చేసే నలుగురు యువకుల విచిత్ర ప్రయాణం

Select Suryaa Now
చంద్రయాన్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్.. రాకెట్ తయారు చేసే నలుగురు యువకుల విచిత్ర ప్రయాణం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో, మరో సరికొత్త కథాంశంతో వస్తున్న ఆసక్తికరమైన చిత్రం చంద్రయాన్. ప్రముఖ నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రంలో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ, ఈ సినిమా కథా బలం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎలాంటి సైన్స్ పరిజ్ఞానం లేకుండా, పెద్దగా చదువుకోకుండా కేవలం ఏదో సాధించాలనే తపనతో నలుగురు అమాయక యువకులు సొంతంగా రాకెట్ తయారు చేసి స్పేస్‌లోకి వెళ్లడం అనే పాయింట్ ఎంతో కొత్తగా అనిపించిందని ఆయన తెలిపారు. ఈ రాకెట్ లాంచింగ్ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు, ఆ క్రమంలో క్రియేట్ అయ్యే ఫన్ ప్రేక్షకులకు అద్భుతమైన ఫీల్‌ను పంచుతాయని పేర్కొన్నారు. ఇది రొటీన్ సినిమా కాదని, కమర్షియల్ ఇంపాక్ట్‌తో కూడిన ఒక అర్థవంతమైన చిత్రమని ఆయన కొనియాడారు.

దర్శకనిర్మాతలు చెబుతున్న వివరాల ప్రకారం, కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. చిత్ర నిర్మాత ప్రవీణ్ మొలక మాట్లాడుతూ, దర్శకుడు శ్రీనాథ్ ఈ కథ చెబుతున్నప్పుడు కలిగిన ఆనందమే సినిమాపై తమకు పూర్తి నమ్మకం కలిగించిందని చెప్పారు. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ప్రతి ప్రేక్షకుడు థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విభిన్నమైన అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.