BREAKING
తిమ్మాపూర్ సీఐ, ఎస్‌ఐ బదిలీ… లంచం ఆరోపణలపై జిల్లా ఎస్పీ చర్యలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసిపి నాయకుడికి కుమారుడికి నివాళులర్పించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య. పల్లె పండుగ 3.0తో గ్రామీణాభివృద్ధికి మరో అడుగు వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై సమాధానం చెప్పే ధైర్యం ఉందా ? సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ అక్రమ ఇసుక రవాణాపై పంజా , రెండు టిప్పర్ల పట్టివేత : ఎస్సై ఎస్.ఎం. నవీద్ వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించే కీలక మార్గాన్ని విస్మరిస్తున్న ప్రపంచ దేశాలు వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత!

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. అధికారిక ప్రకటన!

Select Suryaa Now
మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. అధికారిక ప్రకటన!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. గతంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించి సినిమాపై హైప్‌ను మరింత పెంచేశారు.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలోకి అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ‘కాకా’ సినిమాలో ఆయనొక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ స్పష్టం చేస్తూ ఒక ప్రత్యేక ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటోలో డైరెక్టర్ బాబీ కొల్లి అనురాగ్ కశ్యప్‌కు సినిమాలోని ఒక సన్నివేశాన్ని వివరిస్తుండగా, ఆయన ఎంతో ఏకాగ్రతతో దానిని పరిశీలిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇండియన్ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ ఈ మెగా ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతుండగా, అనురాగ్ కశ్యప్ ఇతర ప్రధాన నటీనటులతో కలిసి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో అనస్వర రాజన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అభివర్ణిస్తూ, ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు అమ్ములు పాప అని మేకర్స్ రివీల్ చేశారు. ఇక ఈ భారీ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్‌గా పని చేస్తున్నారు. భాను-నందు ఈ చిత్రానికి పవర్ పుల్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమాను సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అగ్ర తారాగణం, దిగ్గజ సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. అధికారిక ప్రకటన!