BREAKING
28 న అనంతపురం జిల్లా పురుషుల, మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి

బిగ్ బాస్ 10 నామినేషన్ల వేడి.. సుధీర్ పై సృష్టి తీవ్ర ఆగ్రహం!

Select Suryaa Now
బిగ్ బాస్ 10 నామినేషన్ల వేడి.. సుధీర్ పై సృష్టి తీవ్ర ఆగ్రహం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో హౌస్ నుంచి చైత్ర, కృష్ణుడు ఎలిమినేట్ కాగా, మూడో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్రస్థాయి వివాదాలకు వేదికైంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ తమ మధ్య ఉన్న పాత విభేదాలను, అసంతృప్తిని బహిరంగంగా కక్కేశారు. ఎపిసోడ్ ప్రారంభంలోనే బిగ్‌బాస్ ముకేశ్‌ను సీక్రెట్ రూమ్‌కి పిలిచి కెప్టెన్ ఝాన్సీ అధికారాలను లాక్కునే అవకాశం ఇవ్వగా, అతను దానికి మొగ్గు చూపడంతో ఝాన్సీ తన ప్రత్యేక అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం ఎన్విలప్‌లు సాధించిన కంటెస్టెంట్లతో నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది.

ఈ నామినేషన్ల పర్వంలో ముఖ్యంగా రాంప్రసాద్ వంశీని నామినేట్ చేస్తూ ఆహారం వడ్డించే సమయంలో అరుస్తున్నాడని ఆరోపించాడు. ఇదే సమయంలో మానిటర్ దేబ్‌జానీ, వర్షిణిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వంశీపై చెత్త వేయగా, అన్నం పెట్టిన వారిపైనే చెత్త వేశారంటూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. ఆ తర్వాత రాంప్రసాద్ తనకు వచ్చిన అవకాశాన్ని రోహిత్‌కు ఇవ్వడంతో, అతను సుధీర్‌ను నామినేట్ చేశాడు. సుధీర్ సొంత నిర్ణయాలు తీసుకోకుండా వర్షిణి చెప్పినట్లే ఆడుతున్నాడని రోహిత్ విమర్శించాడు.

ఈ ఎపిసోడ్‌ మొత్తానికి సృష్టి మరియు సుధీర్ మధ్య జరిగిన ఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమ మధ్య ఏదో సంబంధం ఉందంటూ హౌస్‌లో జరుగుతున్న చర్చపై సృష్టి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుధీర్ తనతో కంటెంట్ చేయడం కోసమే ప్లాన్ చేస్తున్నాడని త్రిగుణ్ చెప్పడంతో ఆమె తీవ్ర అగ్రహానికి గురైంది. అదే సమయంలో తనకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ వ్యాఖ్యానించడంతో సృష్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వార్నింగ్ ఇచ్చింది. అనంతరం తన బాధను షాలినితో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామాలన్నీ హౌస్‌లోని పాత అనుబంధాలలో వచ్చిన చీలికలను బయటపెడుతూ రాబోయే రోజుల్లో ఆట మరింత ఉత్కంఠభరితంగా మారనుందని స్పష్టం చేస్తున్నాయి.