BREAKING
ప్రభాస్ 'ఫౌజీ' డేట్‌పై టాలీవుడ్ కన్ను: డిసెంబర్ రేసులో పోటీపడుతున్న క్రేజీ సినిమాలు మన పుణ్య క్షేత్రాలు: కడప పుష్పగిరి క్షేత్ర మహత్యం.. కొండ పువ్వులా తేలిన అమృత సరస్సు.. హరిహరుల దివ్య నిలయం ఇండోనేషియాలో ప్రకృతి ప్రళయం.. ఒకేసారి బద్ధలైన 6 అగ్నిపర్వతాలు.. ఆకాశంలోకి దట్టమైన బూడిద మేఘాలు ఒకే జానర్‌కు పరిమితం కాలేను: విలన్ పాత్రలకైనా సిద్ధమంటున్న నటుడు సుమంత్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్ డేట్ ఖరారు: కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన చిత్రం బిగ్‌బాస్ 10 రెండవ రోజు ఎపిసోడ్ హైలైట్స్: రోహిత్‌పై వర్షిణి, కృష్ణుడి తీవ్ర డిప్లొమాను ITIతో విలీనం చేయొద్దు.. ‘శక్తి’ పథకం రద్దు చేయాలి: మణుగూరు పాలిటెక్నిక్ విద్యార్థుల సమరశంఖం! లస్ట్ స్టోరీస్-3 ట్రైలర్ విడుదల: ఓటీటీలో మరోసారి హీట్ పెంచేందుకు సిద్ధమైన క్రేజీ ఆంథాలజీ మళ్లీ ప్రజల్లోకి జగన్: ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన వరుసగా మూడోసారి సెమీస్‌కు పెగులా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అమెరికా చమురు ట్యాంకర్ల ధ్వంసం జమ్మూ కాశ్మీర్ ఇన్‌ఛార్జ్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా మోటార్‌సైకిళ్లు, మద్యం, పాల ఉత్పత్తులపై అమెరికా నిషేధాలు

బిగ్‌బాస్ 10 రెండవ రోజు ఎపిసోడ్ హైలైట్స్: రోహిత్‌పై వర్షిణి, కృష్ణుడి తీవ్ర

Select Suryaa Now
బిగ్‌బాస్ 10 రెండవ రోజు ఎపిసోడ్ హైలైట్స్: రోహిత్‌పై వర్షిణి, కృష్ణుడి తీవ్ర

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 10 రెండో రోజు ఆట ఊహించని మలుపులతో, రసవత్తరమైన వాదనలతో పూర్తిగా వేడెక్కింది. 'మహాపరీక్ష'లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా కనిపిస్తాడనుకున్న నటుడు కృష్ణుడు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరోవైపు, యాంకర్ వర్షిణి రోహిత్ తీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, హౌస్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

హౌస్‌లో నాయకులుగా ఎంపికైన రామ్‌ప్రసాద్, రోహిత్‌ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సైన్యాలను ఏర్పాటు చేసేందుకు ఒక బ్యాగ్ టాస్క్‌ను నిర్వహించారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన బ్యాగ్‌ల ద్వారా సభ్యులు తమ లీడర్లను ఎన్నుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో వర్షిణిని చివరి వరకు ఎంచుకోకపోవడం, రోహిత్ జోక్యంతో ఆమె రామ్‌ప్రసాద్ టీమ్‌లోకి వెళ్లాల్సి రావడం ఆమెలో అసంతృప్తిని రగిలించింది. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ లీడర్లతో వాగ్వాదానికి దిగింది.

అనంతరం బ్లూ టీమ్ సభ్యులలో అనర్హుల పేర్లు చెప్పమన్న సందర్భంలో వర్షిణి అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుంది. అగ్నిపరీక్ష సమయంలో మంచి వైబ్ ఇచ్చిన రోహిత్, హౌస్‌లోకి వచ్చాక తన యాటిట్యూడ్‌ను పూర్తిగా మార్చుకున్నాడని ఆమె విమర్శించింది. తాను ఏకంగా పెద్ద తోపులా ఫీలవుతున్నాడని, ఇతరులను సరిగా గౌరవించట్లేదని ఘాటుగా స్పందించింది. రోహిత్‌కు రియాలిటీ ఏంటో తెలియాలని, ఆయన అహం దెబ్బతినాలని ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించాయి.

మరోవైపు నామినేషన్ బాధ్యతలను స్వీకరించిన రోహిత్ సైతం కృష్ణుడు, రామ్‌ప్రసాద్, వర్షిణి తదితరులను అనర్హులుగా ప్రకటించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. రోహిత్ వ్యవహారశైలిపై మండిపడిన కృష్ణుడు, పవర్‌ని అడ్డంపెట్టుకుని సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రొటెక్టివ్‌ బాస్ టాస్క్‌లో భాగంగా జరిగిని గేమ్‌లో ఫౌల్ ప్లే ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. మొత్తానికి రెండో రోజే హౌస్‌లో మాటే తూటాగా మారి, సభ్యుల మధ్య చెలరేగిన ఈ విభేదాలు రాబోయే రోజుల్లో గేమ్‌ను మరింత రక్తి కట్టించనున్నాయి.