BREAKING
ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు..

యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం

Select Suryaa Now
యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం

నరసరావుపేట : మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి కారణాలతో యువతలో పక్షవాతం ముప్పు పెరుగుతోందని మెదడు, నరముల వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం. సౌమ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న నిర్వహించే ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ‘ప్రతి నిమిషం కీలకమే’ అనే నినాదం పక్షవాత చికిత్సలో సమయం ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు.
ముఖం వంకరగా మారడం, చేయి లేదా కాలులో బలహీనత, మాట తడబడటం, చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయంతో పాటు శాశ్వత వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అధిక రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొగాకుకు దూరంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని డాక్టర్ సౌమ్య తెలిపారు. యువతతో పాటు అన్ని వయస్సుల వారు అప్రమత్తంగా ఉండి, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు.