BREAKING
బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ స్వాగతం

Select Suryaa Now
యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ స్వాగతం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   బొమ్మిరెడ్డి వంశ యువ నేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్, దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మనుమడు, దివంగత  నేత డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు,  ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. శనివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం ఆయా వార్డుల కౌన్సిల్ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అశేష జనం ఆయనకు అఖండ స్వాగతం పలికి మంగళ హారతులు ఇస్తూ శాలువాలు పూలమాలలతో సన్మానాలు చేస్తూ స్వాగతం పలికి విశేషంగా ఆదరించారు.రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరి వైద్య సేవలతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలు కూడా అందించాలన్న లక్ష్యంతో ఆత్మకూరు అభివృద్ధి ఏకైక అజెండాగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారని ఆమెను అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని తారకనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి అందర్నీ కోరారు. ఆయన ప్రచారంలో విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల నుండి అశేష ప్రజాదరణ లభించింది. బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన, అందిస్తున్న వైద్య సేవలు, సామాజిక సేవలు, ప్రజాసేవలను అందరూ గుర్తు చేసుకుంటూ ఆత్మకూరు మున్సిపాలిటీ అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి షకీలా నాయకత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందగలదని సర్వత్ర అభిప్రాయపడుతూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.