యువ క్రికెటర్లకు మాలకొండరాయుడు చేయూత
యువ క్రికెటర్లకు మాలకొండరాయుడు చేయూత
పామూరు, మేజర్ న్యూస్ :
మొయినాబాద్‌లోని ఎస్‌ఎల్ గ్రాండ్ అరేనా క్రికెట్ గ్రౌండ్‌లో మండలంలోని బొట్లగూడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కందిమల్ల నాగయ్య కుమారుడు కందిమల్ల మాలకొండరాయుడు ఆధ్వర్యంలో యూత్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు మాలకొండరాయుడు ప్రథమ నగదు బహుమతిగా రూ.20,116 అందజేశారు. టోర్నమెంట్‌కు హాజరైన క్రీడాకారులు, నిర్వాహకులు, ఇతరులకు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాలకొండరాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పలువురు అభినందించారు.