విలేజ్ హెల్త్ సెంటర్ భవనం పరిశీలన
మెలియాపుట్టి. అక్టోబర్ 13. మేజర్ న్యూస్....
మెళియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్ భవనాన్ని పాతపట్నం పంచాయతీరాజ్ డీఈ ఎం.ఎన్. గులామ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర భవనంలోని వివిధ భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, భవనం ప్రస్తుత స్థితిగతులను గమనించారు. భవనానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన భవనాల పరిస్థితి, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించడంపై అధికారులు దృష్టి సారించారు. గంగరాజుపురం ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించిన డీఈ.. భవనానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ పర్యటనలో టీఏ చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.