విలీన మండలాల న్యాయవాదులకు కొత్త సారధ్యం
విలీన మండలాల న్యాయవాదులకు కొత్త సారథ్యం
కన్వీనర్‌గా ఇళ్లా చిన్నారెడ్డి ఏకగ్రీవ ఎంపిక
ముగ్గురు కో-కన్వీనర్లతో అడ్‌హాక్ కమిటీ
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని వెల్లడి
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
(ఎటపాక)
చింతూరు డివిజన్ పరిధిలోని విలీన మండలాల న్యాయవాదుల సంఘానికి కొత్త అడ్‌హాక్ కమిటీ ఏర్పాటైంది. ఎటపాక మండల కేంద్రంలో మంగళవారం జరిగిన న్యాయవాదుల అత్యవసర సమావేశంలో ఇళ్లా చిన్నారెడ్డిని కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో-కన్వీనర్లుగా ఇసంపల్లి శ్రీను, లక్ష్మీనారాయణ, పెదముత్యం ప్రతాప్‌ను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కన్వీనర్ ఇళ్లా చిన్నారెడ్డి మాట్లాడుతూ విలీన మండలాల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై సంఘం తరఫున సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
కమిటీ సభ్యులుగా తిరువీధుల మల్లికార్జున్, కొత్తపల్లి రాంబాబు, మోసం సంజీవరావు, విజ్జగిరి రవితేజ, ప్రవీణ్, తానికొండ వాసు, సున్నం వెంకటరమణ, ఆత్రం నవీన్, దుర్గాప్రసాద్, కామేష్‌లను ఎన్నుకున్నారు.
నూతన కమిటీకి సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, గూడపర్తి నాగరాజు, అవులూరి సత్యనారాయణ, పేరాల నాగరాజు, పాయం రవివర్మ అభినందనలు తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కొత్త కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.