BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

విజయనగర అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావాలి

Select Suryaa Now
విజయనగర అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావాలి

విజయనగరం, సూర్య: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీమతి కోలగట్ల శ్రావణి  శనివారం 3వ డివిజన్‌లోని పూల్‌బాగ్ కాలనీ, 23వ డివిజన్‌లోని జమ్ము పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తన తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్ర స్వామి  అడుగుజాడల్లో నడుస్తూ, విజయనగరం నగర అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బండారు ఆనంద్, 23వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పొదిలాపు భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.