BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

విజయమే లక్ష్యంగా పనిచేయాలి... స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి..

Select Suryaa Now
విజయమే లక్ష్యంగా పనిచేయాలి... స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి..
  • వైసీపీ సమావేశంలో కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే శ oబంగి పిలుపు 

తెర్లాం, సూర్య:  స్థానిక ఎన్నికల్లో మన సత్తా సాటి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శం బ o గీ  వెంకట చినప్పలనాయుడు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రామకృష్ణ సినిమా హాలు ఆవరణలో జరిగిన వైసిపి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తె ర్లాం  ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పిలుపును సార్ధకం చేయాలన్నారు. రాష్ట్రమంతటా ఇతర పార్టీలు గెలిచిన ఓడిన తెర్లాం మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ వైసిపి ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ పార్టీయే విజయ దుందుభి మోగించిన సంగతి గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎంపిటిసిలు సర్పంచులు   కైవసం చేసుకుని విజయాల పరంపరగా దిశగా పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. . తెర్లాం  లో17 ఎంపీటీసీలు 33 గ్రామపంచాయతీలు జరిగే ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో ఐక్యమత్యంతో పనిచేసి విజయం సాధించే విధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని అలాగే జగనన్న గత ప్రభుత్వంలో ఏ ఏ పథకాలు అమలు చేసారో అవి ప్రజలకు ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయో ఆ విషయాలను కూడా వారికి చెప్పి మన వైపు వారి మనసులను మళ్ళించే విధంగా కృషి చేయాలన్నారు.. ప్రభుత్వం లేదనీ అధైర్య పడద్దని  ప్రతి కార్యకర్తకు ఏ ఒక్క సహాయ సహకారాలు కావాలన్నా అండదండలుగా ఉంటామని మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అలాగే ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ చదివి వినిపించారు. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ ఆదేశాలను అనుసరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఆయన మరోసారి కార్యకర్తలకు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షులు తెంటు సత్యo నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బొమ్మీ శ్రీనివాసరావు మాజీ జడ్పిటిసి ప్రతినిధి గర్భాపు రామారావు మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి బాబ్జీరావ్ మాజీ వైస్ ఎంపీపీ ప్రతినిధి పి అప్పలరాజు విజయరాంపురం మాజీ సర్పంచ్ బూరి మధుసూదనరావు గుల్లిపల్లి మృత్యుంజయ నాయుడు వారు ఎన్నికల అభ్యర్థులపై సూచనలు సలహాలు అందించారు. సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావడం విశేషం