BREAKING
తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

వెల్దుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు మూడు బెస్ట్ అవార్డులు

Select Suryaa Now
వెల్దుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు మూడు బెస్ట్ అవార్డులు

కర్నూలు (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్): కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు విశేష ప్రతిభ కనబరిచి మూడు కీలక అవార్డులను కైవసం చేసుకుంది. జిల్లా కలెక్టర్ శ్రీమతి సిరి మేడమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.పోషణ మాసోత్సవంలో భాగంగా చేపట్టిన అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించి, వెల్దుర్తి ప్రాజెక్టును జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు గాను వెల్దుర్తి ప్రాజెక్ట్ సీడీపీఓ శ్రీ పి. లూక్ గారికి కలెక్టర్ చేతుల మీదుగా "బెస్ట్ ఛాంపియన్" అవార్డు లభించింది.అలాగే వెల్దుర్తి-8 అంగన్వాడీ కేంద్రానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కొండ రేణుకమ్మకు "ఉత్తమ టీచర్" అవార్డు దక్కగా, ఇదే కేంద్రానికి చెందిన శ్రీమతి సరస్వతిని "బెస్ట్ తల్లి"గా ఎంపిక చేసి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.ఇదే వేదికపై కలగొట్ల గ్రామం 2వ అంగన్వాడీ కేంద్రానికి చెందిన తుపాకుల విక్రమ్ కుమార్ (7 నెలల బాబు)కు జిల్లా కలెక్టర్ సిరి మేడమ్ సొంత చేతులతో అన్నప్రాసన గావించారు.ఒకే ప్రాజెక్టుకు ఐసీడీఎస్ జిల్లా స్థాయిలో మూడు అవార్డులు రావడం పట్ల వెల్దుర్తి ప్రాజెక్ట్ సిబ్బంది, తోటి అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ, అవార్డు గ్రహీతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.