BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రచార ఆర్భాటమే: అనంతపురంలో చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం, సీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ రాకా సినిమా కాస్టింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. తెరపైకి కొత్త చర్చ! పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహానటి శారద లేటెస్ట్ ఫోటోలు.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్న అభిమానులు! గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు!

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు, ఆయన పాటించిన సత్యం, అహింస సిద్ధాంతాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస మార్గంలో నడవాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.