ఉద్యాన రంగంలో విప్లమాత్మకమైన మార్పులు వస్తున్నాయి.. ఎమ్మెల్యే పరిటాల సునీత
ఉద్యాన రంగంలో విప్లమాత్మకమైన మార్పులు వస్తున్నాయి.. ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి మేజర్ న్యూస్:ఉద్యాన రంగంలో విప్లమాత్మకమైన మార్పులు వస్తున్నాయి అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు బుధవారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ పై ఆమె రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంగులకుంట గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన రైతులతో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం దాని వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. మార్కెట్ సమస్యల నుండి రైతులను ఆదుకునేందుకే రాయలసీమ వ్యాప్తంగా రూపాయలు ఒక లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన రంగాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు పేర్లు ద్వారా ఉద్యాన రైతులకు కొత్త అవకాశాలు కల్పించడం సాగును మరింత లాభసాటిగా మార్చడం రాయలసీమ పండ్లను ప్రపంచం మార్కెట్టుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు రైతుల భవిష్యత్తుకు అండగా నిలిచే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో పాటు ఉద్యాన రైతులకు మేలు చేసే పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ సందర్భంగా పేర్కొన్నారు.