తొట్టంబేడు పోలింగ్ కేంద్రంలో యుద్ధ వాతావరణం, ఉద్రేకత, పోలీసులు లాఠీ చార్జ్.
శ్రీకాళహస్తి, నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో జడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియ మొదటి రోజు అనేక అల్లర్లు గొడవలు, జరిగాయి. ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మండలం పోలింగ్ కేంద్రం వద్ద కాపు కాశారు. వైయస్సార్ పార్టీ నాయకులు గత పరిపాలనలో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను గుర్తుచేసుకొని అదేవిధంగా మేము చేసి చూపెడతాం అని అల్లర్లకు పాల్పడ్డారు. సాయంత్రం నాలుగు గంటలకు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్లు వెయ్యడానికి ర్యాలీగా బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. జీర్ణించుకోలేని వైయస్సార్ పార్టీ నాయకులు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. పోలీసులు లాటి ఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీని ఫలితంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇరు వర్గాల మోహరించి యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు లాటి ఛార్జ్ ద్వారా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆర్టీసీ బస్సులో ఎక్కించి దూరంగా వదిలిపెట్టడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ బుధవారం తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు మాత్రమే నామినేషన్లు వేయడం జరిగింది. సిపిఎం నాయకులను కూడా నామినేషన్లు వెయ్యినీయకుండా తిప్పి పంపారు.