థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు
థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు!
కందికుంట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం
కదిరి: ముత్యాల చెరువు పంచాయతీ పరిధిలోని కందికుంట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసుల సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన కొత్త బోరు మోటారు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు.
దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు తొలగడంతో ఊరట లభించిందని పేర్కొన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించినందుకు “థాంక్యూ ఎమ్మెల్యే సార్” అంటూ ధన్యవాదాలు తెలిపారు.