BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు --తోకతిప్ప వద్ద రూ.8 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు

Select Suryaa Now
తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు                  --తోకతిప్ప వద్ద రూ.8 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు

 భీమవరం, మేజర్ న్యూస్ : యనమదుర్రు కాలువపై తోకతిప్ప వద్ద సుమారు రూ. 8 కోట్లతో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితమే యనమదుర్రు కాలువపై మూడు వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికీ, అప్రోచ్ రోడ్లు లేకపోవడం వల్ల అవి ఇన్నాళ్లూ నిరుపయోగంగా మిగిలిపోయాయన్నారు. ఇటీవల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఈ అప్రోచ్ రోడ్ల ఆవశ్యకతను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, పనుల నిమిత్తం రూ. 31 కోట్లు మంజూరు చేయించారని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో ఖజానా ఖాళీ అయి తీవ్ర నిధుల కొరత ఉన్నప్పటికీ, భీమవరం నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తీర్చడమే ప్రథమ ప్రాధాన్యతగా ఎమ్మెల్యే అంజిబాబు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, రాబోయే రోజుల్లో తీరప్రాంత గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. అలాగే జాతీయ రహదారి 165 కు సంబంధించి ఉన్న న్యాయపరమైన చిక్కులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చేరుతాయని, తద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న యనమదుర్రు కాలువపై నిర్మించిన మూడు వంతెనల అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేసి, మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి సీతారామలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, బాపిరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కృష్ణ బలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ చైర్మన్ సుజాత రామచంద్రరాజు, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా