టీడీపీలో చేరిన బోగోలు కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మీరాముద్దీన్
బోగోలు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని బోగోలు పంచాయతీ చెంచు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మీరాముద్దీన్ తెలుగుదేశం పార్టీలో చేరారు.స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో ఆయన అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయనకు పసుపు కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ పాలన మరియు అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు షేక్ మీరాముద్దీన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.