BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా షేక్‌ షాకీరా నామినేషన్‌ దాఖలు

Select Suryaa Now
టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా షేక్‌ షాకీరా నామినేషన్‌ దాఖలు

 

అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెర.. ఎన్నికల పోరులో సై 

పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్‌ రఫీ సతీమణి బరిలోకి

నామినేషన్ల సమరానికి కదిలిన పసుపుదళం

నాయుడుపేట /పెళ్లకూరు మేజర్ న్యూస్ :

నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా షేక్‌ షాకీరా నామినేషన్‌ దాఖలు చేశారు.పట్టణ టీడీపీ అధ్యక్షుడు,మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ రఫీ సతీమణి షాకీరా ఎన్నికల బరిలోకి దిగడంతో పార్టీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.టీడీపీ తరఫున చైర్‌పర్సన్‌ స్థానానికి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చిన నేపథ్యంలో షాకీరా అభ్యర్థిత్వం ఖరారైంది.తాజాగా ఆమె నామినేషన్‌ సమర్పించడంతో అభ్యర్థి ఎంపిక కసరత్తు నుంచి ఎన్నికల పోటీ దిశగా పార్టీ ముందడుగు వేసింది.స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతున్న రఫీ కుటుంబం నుంచి షాకీరా పోటీకి దిగడం పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. తాజాగా టీడీపీ తరఫున షాకీరా కూడా నామినేషన్‌ సమర్పించడంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ మరింత స్పష్టమైంది.అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో వార్డులవారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ప్రజా సమస్యలను ప్రచారంలోకి తీసుకురావడం, ఓటర్ల మద్దతు కూడగట్టడం తదుపరి కార్యాచరణలో కీలకం కానున్నాయి. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి పట్టణ సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు ప్రతిపాదించే కార్యాచరణపై ఎన్నికల చర్చ కేంద్రీకృతం కానుంది.