తాత తండ్రుల ఆశయాలను కొనసాగించేందుకే రాజకీయాల్లోకి....
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : దశాబ్దాలుగా తన తాత రామిశెట్టి భాస్కరరావు భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారని, అదేవిధంగా తన తండ్రి బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ ఇటీవల హఠాన్మరణం చెందడంతో వారి ఆశయాలను కొనసాగించేందుకే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు నాల్గవ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి రామిశెట్టి కేతన్ కుమార్ పేర్కొన్నారు. తనను నాలుగవ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే చైర్పర్సన్, అదేవిధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో నాలుగవ వార్డును అభివృద్ధి చేస్తానన్నారు. శుక్రవారం ఆయన చైర్ పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా శ్రీనివాసులు, బత్తల హరికృష్ణ, కూటమి నాయకులు కాసా శ్రీనివాసులు తదితర నాయకులతో కలిసి తనకు తనకు కేటాయించిన నాలుగో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి మాట్లాడుతూ చిన్న వయసులోనే తండ్రి తాతల ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కేతన్ కుమార్ ను ఆశీర్వదించి కౌన్సిలర్ గా, అదేవిధంగా తనను మున్సిపల్ చైర్మన్ గా గెలిపిస్తే నాలుగో వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వార్డులోని ప్రజలందరినీ కలుసుకొని స్థానిక సమస్యలను గురించి తెలుసుకొని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో మునిసిపాలిటీతోపాటు నాలుగవ వార్డును కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు,నాయకులు, బత్తల హరికృష్ణ స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.