స్వచ్ఛతలో.... ఇమామి ఆగ్రో టెక్ లిమిటెడ్ కు అవార్డు
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయిల్ ఉత్పత్తి కర్మాగారం అయినటువంటి ఇమామి ఆగ్రోటెక్ లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డును అందజేసింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అవార్డును ప్రధానం చేసినట్లు కర్మాగారం యూనిట్ హెడ్ ఎం.వి నారాయణమూర్తి బుధవారం మేజర్ న్యూస్ కు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం చర్యలు మెరుగుపరచడం లాంటి అంశాల్లో కర్మాగారం మంచి ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ అవార్డు అందజేశారని యూనిట్ హెడ్ పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో అవార్డు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలు చేపడతామని యూనిట్ హెడ్ తెలిపారు.