సుంకులమ్మ ఆశీస్సులు పట్టణ ప్రజలకు ఉండాలి..!
సుంకులమ్మ ఆశీస్సులు పట్టణ ప్రజలకు ఉండాలి..!
- దేవీ నవరాత్రుల 7వ రోజు ఉత్సవాల్లోఎమ్మెల్యే
- సుంకులమ్మ కు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయంలో దేవీ శరన్న నవరాత్రుల ఏడవ రోజు ఉత్సవాల్లో భాగంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు . ముందుగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని అంతేకాక నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి పట్టణ అధ్యక్షుడు గుంజుపల్లె భాస్కర్ రెడ్డి , 28వ వార్డు టిడిపి ఇంచార్జ్ గోవర్ధనగిరి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.