BREAKING
రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు! తమిళనాడు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రితో కిరణ్ రిజిజు భేటీ: సంక్షేమ పథకాలు, నిధులపై కీలక చర్చలు అచ్యుతం, శ్రీపథం అభివృద్ధి పనుల పరిశీలన: నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఆదేశం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు సమాప్తం: వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం గణనాథుడి లడ్డూకు రూ.1.80 లక్షల ధర చింటూ కుటుంబానికి కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ పరామర్శ ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తోందా.. ఎలాంటి సప్లిమెంట్లు లేకుండానే ఈ 5 పోషకాలతో శక్తిని పొందండి! ఏపీ ఇన్నోవేషన్ క్లస్టర్లలో భాగస్వామ్యానికి ఆహ్వానం: 'బ్లాక్‌చెయిన్ ఫర్ ఇంపాక్ట్' బృందంతో మంత్రి నారా లోకేశ్ భేటీ నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వొద్దు.. బాటిల్స్‌పై హెచ్చరికలు తీసుకురానున్న సీడీఎస్‌సీఓ! బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోన్న హనుమాన్ అంశ్.. రూ.360 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్! స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి సీనియర్ హీరోయిన్ రాధ ఇంట గణనాథుడి పూజలు.. కూతురు కార్తీక నాయర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్! శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్! ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పూజా మేరీ జాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత!

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

పామూరు, మేజర్ న్యూస్ : 

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ  పామూరు మండల మాజీ  అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కనిగిరి ఎమ్మెల్యే  డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బోడవాడ ఎంపీటీసీ పరిధిలోని అయ్యవారిపల్లి, బోడవాడ, అయ్యన్నకోట పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో గురువారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టంగా సిద్ధం కావాలని పువ్వాడి వెంకటేశ్వర్లు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. బోడవాడ ఎంపీటీసీ పరిధిలోని అయ్యవారిపల్లి, బోడవాడ, అయ్యన్నకోట పంచాయతీల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌ చౌదరి, కనిగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పాలపర్తి వెంకటేశ్వర్లు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యారవ సంజీవ ప్రసాద్‌రెడ్డి,పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్‌, మార్నేని రామకృష్ణ, దొడ్డ కోటిలింగం, వేమూరి ప్రభాకర్‌, మార్నేని మాలకొండయ్య, దండబోయిన మల్లికార్జున, వేమూరివీన్‌, తూమాటి సుభాస్కరరావు, శ్రీనివాసరెడ్డి, జింక మధు తదితరులు పాల్గొన్నారు.