BREAKING
అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స

ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తోందా.. ఎలాంటి సప్లిమెంట్లు లేకుండానే ఈ 5 పోషకాలతో శక్తిని పొందండి!

Select Suryaa Now
ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తోందా.. ఎలాంటి సప్లిమెంట్లు లేకుండానే ఈ 5 పోషకాలతో శక్తిని పొందండి!

సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ఎలాంటి భారీ పనులు చేయకపోయినా రోజంతా తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడుతుంటారు. సరైన నిద్ర ఉన్నప్పటికీ ఉదయం లేవగానే మందకొడిగా ఉండటానికి శరీరంలో తగిన పోషకాలు కొరవడటమే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే కృత్రిమ సప్లిమెంట్లపై ఆధారపడకుండా, ప్రతిరోజూ మనం తీసుకునే సహజమైన ఆహార పదార్థాల ద్వారానే శరీరానికి కావాల్సిన శక్తిని పొందవచ్చు. దీనికోసం మన రోజువారీ డైట్‌లో కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం.

శరీరంలో శక్తి ఉత్పత్తికి బి-కాంప్లెక్స్ విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు, పాలు, పెరుగు, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గోధుమలు, బ్రౌన్ రైస్ అలాగే బాదం, వేరుశనగల్లో విటమిన్ అక్కడ "భరిపూర్ణంగా"లభిస్తుంది. వీటితో పాటు ఎముకల బలానికి, రోగ నిరోధక శక్తికి విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఉదయం పూట పడే సూర్యరశ్మి దీనికి చక్కని వనరుగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ఎండలో గడపడంతో పాటు పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సహజంగానే నివారించవచ్చు.

రక్తహీనత కారణంగా వచ్చే తీవ్రమైన నీరసాన్ని తరిమికొట్టేందుకు ఐరన్ పోషకం చాలా అవసరం. ఖర్జూరాలు, బెల్లం, అంజీర్, దానిమ్మ, బీట్‌రూట్, మునగాకు, నువ్వులు, రాగులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే ఐరన్ శరీరం బాగా ఒంటపట్టాలంటే విటమిన్ సి తోడుండాలి కాబట్టి, ఆహారంలో నిమ్మరసం వంటివి చేర్చుకోవడం మంచిది. అలాగే కండరాల అలసటను తగ్గించి మంచి నిద్రను అందించడంలో మెగ్నీషియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, అరటిపండ్లు, కాకరకాయ, డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.  

శరీరంలో స్టామిమాను పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొన్ని ప్రత్యేక పోషకాలు సహాయపడతాయి. చేపలు, సోయాబీన్స్, పప్పులు, బ్రోకలీ, క్యాలిఫ్లవర్ వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు పాటించడం ద్వారా ఎలాంటి సప్లిమెంట్లు లేకుండానే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.