BREAKING
పాలకొల్లు మండలంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల్లో 85 సెట్ల నామినేషన్లు నమోదు గురవయ్య, లక్ష్మీలకు భద్రత కల్పించాలి వత్సవాయిలో 122 MPTC నామినేషన్లు.. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ రావులపాలెంలో 114 నామినేషన్లు దాఖలు టిడిపి తరఫున రాజగోపాల్ నామినేషన్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన మిస్టర్ దెయ్యం సినిమా.. హాజరైన ప్రముఖులు! వాకర్స్ సభ్యులకు,క్రీడాకారులకు మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అభ్యర్థన గోపతండలో ఉద్యోగ విరమణ సన్మానం* * ఉద్యోగికి ఘన వీడ్కోలు.. మునిసిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది : 44వ వార్డు కూటమి అభ్యర్థిని బండి భారతి ధీమా పోలీసుల విధులపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన ధర్మవరం మున్సిపాలిటీలో హోరాహోరీగా ఎన్డీఏ కూటమి ప్రచారం కమలం, సైకిల్ గుర్తులకు ఓటేసి గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి విజ్ఞప్తి డైరెక్టర్ శ్రీ కార్తిక్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సెన్సేషనల్ స్టార్ రుక్మిణి వసంత్.. తారగా గ్రాండ్ ఎంట్రీ! ఆత్రేయపురంలో కోలాహలంగా నామినేషన్ చివరి రోజు 41 నామినేషన్లు కూటమి అభ్యర్థుల విజయం తథ్యం మాజీ జడ్పీటీసీ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం  ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని  ఛాంబర్‌లో నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాఫ్ట్‌వేర్ ద్వారా చేపట్టిన ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు.  జిల్లాలోని ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 594 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది అవసరాలను గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ), ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ), ఇద్దరు ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) చొప్పున మొత్తం నలుగురు సిబ్బందిని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మొత్తం 594 మంది పీఓలు, 594 మంది ఏపీఓలు, 2,376 మంది ఓపీఓలు కలిపి 3,564 మంది సిబ్బంది అవసరం కాగా, 20 శాతం రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 4,277 మందిని కేటాయించేలా ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఇందులో 713 మంది పీఓలు, 713 మంది ఏపీఓలు, 2,851 మంది ఓపీఓలు ఉన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్,  చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మీ నరసింహ, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి,  ఎన్ఐసి టెక్నికల్ అధికారులు ఉన్నారు.