స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతివ్వండి.
అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్ వేణు
స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతివ్వండి.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సూపర్ సిక్స్ హామీలు, మెగా డీఎస్సీతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయంతో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ట్రిపుల్ ఇంజిన్ పాలన అవసరమని పేర్కొన్నారు.అర్నబ్ తుఫాను ముప్పును ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణతో పాటు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని దగ్గుపాటి వివరించారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.