andhrapradesh
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
- ఎంపీడీవో డివి శ్రీలత
బాడంగి, సూర్య: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని బాడంగి ఎంపీడీఓ డి.వి. శ్రీలత సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబరు 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు దశల్లో జరగనున్నాయి. ఆయా దశల్లో పోలింగ్ రోజే ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ సూచించారు.