BREAKING
నిద్రలేమి మనుషులను ఎంతలా దెబ్బతీస్తుంది? ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ప్రతిరోజూ నడక ఎంత ముఖ్యం? వ్యాయామం చేయలేని వారికి వాకింగ్ ఎందుకు అద్భుతమైన అలవాటు? టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటిన మంజుల, మౌనిక.. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసు: ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ అక్టోబర్ 6కి వాయిదా అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగి కుమారుడికి - ఉద్యోగం కల్పించాలని - జెఎండీకి వినతి సురేంద్రబాబు కుటుంబానికి మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని - విజ్ఞప్తి మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్

సంగంలో 15వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా

Select Suryaa Now
సంగంలో 15వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా

సమస్యలు పరిష్కరించాలంటూ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు

సంగం మేజర్ న్యూస్ :  సంగం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారానికి 15వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు వీఆర్ఏలు వినతిపత్రాలు సమర్పించారు. తమ సమస్యలు, గోడును ప్రభుత్వం ఆలకించి తగిన పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.  వీఆర్ఏలుగా ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందిస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.