BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

స్మార్ట్ ఫోన్ లేకుంటే కుల, ఆదాయ ధ్రువపత్రం రానట్టేనా?!

Select Suryaa Now
స్మార్ట్ ఫోన్ లేకుంటే కుల, ఆదాయ ధ్రువపత్రం రానట్టేనా?!

 

 

ఎస్.రాయవరం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్:
ప్రభుత్వ సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా 'మనమిత్ర' వాట్సాప్ ద్వారా కుల, ఆదాయ ధ్రువపత్రాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,  'మనమిత్ర' వల్ల స్మార్ట్ ఫోన్, వాట్సాప్ సౌకర్యం లేని పేదలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లాసెట్, పీజీసెట్ తదితర ప్రవేశ పరీక్షలు, విద్యా అవసరాల కోసం కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో విద్యార్థులు సకాలంలో సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్ కాపీని మొబైల్ లో పొందే అవకాశం ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ లేని వారు, డిజిటల్ ప్రక్రియపై అవగాహన లేని వారు ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలో మనమిత్ర తో పాటు మీసేవ కేంద్రాల్లోనూ కుల, ఆదాయ ధ్రువపత్రాల ప్రింటెడ్, సర్టిఫైడ్ కాపీలు పొందే అవకాశం కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ధ్రువపత్రం పొందే వెసులుబాటు కల్పిస్తే స్మార్ట్ ఫోన్ లేని ప్రజలకు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.