సింహాద్రిపురం జడ్పీ హైస్కూల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
సింహాద్రిపురం మేజర్ న్యూస్:
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ తనయుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఉదారతతో ఈ వాటర్ ప్లాంట్‌ను పాఠశాలకు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంఆర్‌ఓ అనురాధ, ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి, ఎంఈఓలు ఖాదర్ బాషా, అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిచంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా