సి సి గిరి ఎంపీటీసీ అభ్యర్థిగా అనిలమ్మ నామినేషన్
సి సి గిరి ఎంపీటీసీ అభ్యర్థిగా అనిలమ్మ నామినేషన్
– కూటమి అభ్యర్థిగా బరిలోకి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్ సతీమణి అనిలమ్మ
గుడిబండ మేజర్ న్యూస్:
గుడిబండ మండలం సీసీ గిరి పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్ సతీమణి అనిలమ్మ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం గుడిబండ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు, మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, క్లస్టర్ ఇన్‌చార్జి బాలేపల్లి రాజు, లాయర్ శివకుమార్‌తో పాటు మండలంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిబండ రిపోర్టర్ దేవరాజు