శ్రీరామలో ఘనంగా రక్తదాన శిబిరం
కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల జాతీయ సేవ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా జాతీయ సేవ విభాగం యూనిట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వాసు, జాతీయ సేవ విభాగం కన్వీనర్ చక్రిశ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి