BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

శ్రీకాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ బరిలో వైసిపి, కూటమి బీసీ నేతలు

Select Suryaa Now
శ్రీకాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ బరిలో వైసిపి, కూటమి బీసీ నేతలు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీ  చైర్మన్ బరిలో కూటమి, వైసిపి బీసీ నేతలు.

తిరుపతి జిల్లా  శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం ఎన్నికలలో  కూటమి పార్టీలలో హేమ హేమీలు బరిలో దింపే పనిలో  ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిమగ్నమై ఉన్నారు.  శ్రీకాళహస్తి పట్టణంలో  లక్ష జనాభా ఉన్నారు. ఓటర్లు 72,432 వేలు వరకు ఉన్నాయి . పట్టణంలో పురుషులు ఓటర్లు 34, 810 మహిళా ఓటర్లు 37, 623 వేలు ఉన్నాయి.  పురపాలక సంఘం చైర్మన్, వార్డులు రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చిన బీసీలకు ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వాలని కూటమి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది  .  పురపాలక సంఘంలో ప్రముఖులు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణం యువ నేత , మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ తనయుడు పేట బాలాజీ, గుమ్మడిపూడి దశరదచారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మీన్నల రవి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి.  జనసేన పార్టీ నుండి ప్రముఖ వ్యాపార వేత, మాజీ మున్సిపాలిటీ ఫోర్ లీడర్, మాజీ కౌన్సిలర్  మిద్దెల హరి నీ పోటీకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది . వైయస్సార్ పార్టీ బీసీ నేత జ్ఞానాంబ వారి మధు రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మధు రెడ్డి పేరు పరిశీలన చేస్తున్నట్లు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో 44  వార్డులు నుండి  సుమారు100 మంది వార్డు కౌన్సిలర్లుగా  పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం, వైయస్సార్ పార్టీ,  జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ , సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, మరి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులగా పోటీచేయాలని ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికలలో ఇరు పార్టీలు హేమహేమీలను బరిలో దింపి రాజకీయంగా పట్టు సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టణంలో  పల్లె రెడ్లు, బలిజ, యాదవులు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, గౌడ్లు క్రిస్టియన్లు, ముదిరాజ్, నాయి బ్రాహ్మణులు, కమ్మ, కాపు రెడ్లు,  వారి వారి పరిధిలో రాజకీయంగా మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులుగా రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలో మార్పులు చేర్పులు జరిగితే  కుటమి పార్టీలు నుండి నాగమల్లి దుర్గాప్రసాద్, పి బాలాజీ కుమార్, గుమ్మడిపూడి దశరదాచారి, మి న్నెల రవి  పేర్లు ప్రధానంగా వినపడు తున్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలు కాబట్టి ఎత్తుకు పైఎత్లులు వేసి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో మురికి వాడలు ప్రజలు ప్రాథమిక సమస్యలు ఇంతవరకు పరిష్కారం కావడం లేదని, పరిష్కారం చేసే పార్టీలకు ఓటు వేస్తామని వివిధ మురికివాడల వార్డులు  ప్రజలు తెలియజేస్తున్నారు.  2029 అసెంబ్లీ ఎన్నికలకు పురపాలక సంఘం ఎన్నికలే కీలకం కానున్నాయని రాజకీయ పార్టీలు నేతలు, పట్టణ ప్రజలు చర్చించు కుంటున్నారు. పట్టణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడుతారో కొంతకాలం వేసి చూడాల్సివస్తుంది.                     వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి* 9644411197