శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైలం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం తరఫున చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైలం ఆలయ బృందానికి విజయవాడ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం బృంద సభ్యులు శ్రీ అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు ఆశీర్వచనం అందించి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.