BREAKING
మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు 28 వార్డు హరిజన లక్ష్మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండపల్లి ఇస్మాయిల్ 32 వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి రాయదుర్గం భ్రమరాంబిక అమ్మవారు.. మహాలక్ష్మి దేవి అవతారంలో దివ్యదర్శనం పెనుగొండ 20వ వార్డు తెదేపా 24 వార్డు గెనిగేరి నాగమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇంకొల్లు మండలం జడ్పీటీసీ, ఎం.పి.పి, ఎం.పి.టి.సి రిజర్వేషన్లు ఇలా 36 వార్డు బుల్లారి చన్నవీరప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు ప్రక్రియ !

శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి*

Select Suryaa Now
శ్రీ జోగుళాంబా సమేత  బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు  పట్టువస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి*

 

*శ్రీ జోగుళాంబా సమేత  బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు  పట్టువస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి*

కర్నూలు, అక్టోబర్ 17:- దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన  శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్లకు  జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి  పట్టువస్త్రాలను సమర్పించారు.

శనివారం  కలెక్టర్  అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం తో  తీర్థప్రసాదాలను  అందజేశారు.

అనంతరం  కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పాటిస్తూ,  జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు.  దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు..స్వామి, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

కలెక్టర్‌ వెంట  దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ బి.సుధాకర్ రెడ్డి, అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఈ వో దీప్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.