BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

సీపీఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం!

Select Suryaa Now
సీపీఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం!

 

 

ఎస్.రాయవరం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్: లారస్ ఫార్మా కోసం 650 ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తున్న రాంబిల్లి రైతులకు మద్దతుగా వెళ్తున్న సీపీఎం నేత ఎం.అప్పలరాజును ఎస్.రాయవరం పోలీసులు ఆదివారం ధర్మవరం అగ్రహారంలో గృహ నిర్బంధం చేశారు.ప్రభుత్వ దౌర్జన్యంతో గొరపూడి రైతు లాలం నర్సింగరావు, అప్పన్నపాలెం రైతు చింతలపూడి నూకరాజు మృతి చెందారని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని రాంబిల్లి రైతుల పోరాటానికి మద్దతుగా వెళుతుండగా ధర్మవరం అగ్రహారం గ్రామంలోని తన నివాసంలో ఎస్.రాయవరం పోలీసులు గృహ నిర్భంధం చేసారని సీ పీ ఎం నాయకుడు అప్పలరాజు వెల్లడించారు.