BREAKING
యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి

సీఎం చంద్రబాబును కలిసిన గూడూరి ఎరిక్షన్ బాబు

Select Suryaa Now
సీఎం చంద్రబాబును కలిసిన గూడూరి ఎరిక్షన్ బాబు

వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి
 

యర్రగొండపాలెం మేజర్ న్యూస్ 

 

యర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి అంశాలపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన ఎరిక్షన్ బాబు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఇటీవల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన పుప్పాల వినయ్‌కుమార్‌, పుప్పాల రాజ్‌కుమార్ కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు.బాధిత కుటుంబాల పరిస్థితిని సానుభూతితో విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు త్వరలోనే ఎక్స్‌గ్రేషియా అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.అదేవిధంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు.వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని పనులు, ఫీడర్‌ కెనాల్‌ ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించి ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న ఆశలు, స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల ఎరిక్షన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.